ఈనెల 10న ‘షరాబ్‌ హటావో–తెలంగాణ బచావో’

శంషాబాద్ బాధితురాలి పేరును ఇక మీదట ‘దిశ’ అని పిలవాలని ….నిర్భయ చట్టంలో బాధితురాలి పేరుతో పాటు.. కుటుంబ సభ్యుల వివరాలను బయట పెట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ బాధితురాలి పేరును ఇక మీదట ‘దిశ’ అని పిలవాలని తెలంగాణ పోలీసులు సూచించారు.  నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై ఎస్సై రవికుమార్, ఆర్జీఐఏ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్‌ సస్పెండ్ అయ్యారు..

రాష్ట్ర ఆటోడ్రైవర్స్‌ ….దిశ హత్య కేసు నేపథ్యంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు డిమాండ్‌ చేస్తూ ఈనెల 10న ‘షరాబ్‌ హటావో–తెలంగాణ బచావో’అనే నినాదంతో ఒక్క రోజు ఆటోల బంద్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆటోడ్రైవర్స్‌ జేఏసీ వెల్లడించింది.. మద్యపాన నిషేధం లేకపోవడం వల్లే మద్యం మత్తులో దుండగులు  దిశను హత్య చేశారని, నిందితులకు వెంటనే ఉరి శిక్ష విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రోడ్డు ప్రమాదాలు, సామాజిక నేరాలు పెరగడానికి ప్రధాన కారణం మద్యం తాగడమేనన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఏటా రూ. 500 ఎంవీ ట్యాక్స్‌ మాఫీ చేసి కేసీఆర్‌ చేతులు దులుపుకున్నారని, అదే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతి ఆటోకు రూ. 10 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు.

ప్రధాని దృష్టికి కేటీఆర్‌…. పలు విషయాలు  మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారికి సత్వరమే ఉరిశిక్ష విధించాలని, దీనిపై పునః సమీక్షకు వీల్లేని చట్టాలను తీసుకురావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు.. ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. చట్టాలంటే భయం లేకుండా మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గుల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జస్టిస్‌ ఫర్‌ దిశ ఘటన నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా తీసుకెళ్లారు..

. రామ్‌ గోపాల్ వర్మ….అత్యాచారానికి పాల్పడిన వారిని చంపేయాలి, తగలబెట్టాలి అనే సాధ్యం కాని డిమాండ్లను చేసే బదులు, వారిని ప్రశ్నించడాన్ని టీవిల్లో ప్రసారం చేయాలి. సైకియాట్రిస్ట్‌లు, సోషల్‌ సైంటిస్ట్‌లు వాళ్లను ప్రశ్నించడం ద్వారా వాళ్లలో అలాంటి రాక్షస నేర ప్రవృత్తి ఎలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్లు అంత దుర్మార్గంగా ఎలా ఆలోచించారు.. ఎందుకు ఆలోచించారు..? అని తెలుసుకుంటే భవిష్యత్తులో రేపిస్ట్‌లను ముందే పసిగట్టే అవకాశం ఉంటుంది. పిచ్చికుక్కల పిచ్చికుక్కలను హింసించి చంపాలని డిమాండ్‌ చేయటం కూడా వృథా అని వదిలి పెట్టాలని కాదు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలి. రేపిస్ట్‌లను సమాజానికి చేసిన జబ్బులా భావించి ఆ రోగాన్ని ఎలా తగ్గించాలన్న విషయంలో శాస్త్రీయంగా పరిశోదన జరపాలి. అప్పుడే మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించగలం. ఒక పామును ముక్కలుగా నరికితే మరో పాము మన దగ్గరికి రాకుండా ఉండదు. ఎందుకంటే వాటికి అంత ఆలోచనా శక్తి ఉండదు’  అని రామ్‌ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.

శంషాబాద్‌ మండలంలోని తొండుపల్లి టోల్‌గేటు వద్ద ‘పాపం.. ఆ అమ్మాయిని ఇక్కడే హత్య చేశారు.. అయ్యో కొంచెం ధైర్యం చేసి రోడ్డుపైకి వస్తే ప్రాణాలు దక్కేవి.. పోలీసులు గస్తీ తిరిగి మృగాలను పసిగట్టినా ఘోరం జరగకపోయేది కదా..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

‘ప్రియాంకకు జంతువులంటే చాలా ఇష్టం. వాటిమీద మక్కువతో మెడిసిన్‌లో సీటు వచ్చినా చేరకుండా వెటర్నరీ కోర్సు చదివింది. చిన్నప్పటి నుంచీ కుక్కలు, ఆవులు, గుర్రాలకు ఆహారం తినిపించేది ప్రియాంకకు ఆన్‌లైన్‌లో  కొత్త వంటకాలను చేయడం, జంతువులను ప్రేమించడం, పుస్తకాలు చదవడం, కుటుంబంతో సమయం గడపడం అంటే చాలా ఇష్టం. సంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాము పిల్లలను పద్ధతిగా పెంచామ’ని వివరించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *