ముంబైలో శివసేన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం

ముంబై . అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పోటీ నుంచి తప్పుకోవడంతో శివసేన  , ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. మూడు పార్టీలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందించి… అంగీకారం తెలిపాయి. ఐదేళ్ల​ పాటు సీఎం పీఠం శివసేనకు అప్పగించి, డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్‌, మంత్రి పదవులు చెరి సమానంగా పంచుకునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మూడు పార్టీల నేతలు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్‌ దానికి అంగీకారం తెలిపితే ఆదివారమే శివసేన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే సీఎం పీఠం సేనదే అని ఖరారైనా.. సీఎం అభ్యర్థి ఎవరు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చజరుగుతోంది. శివసేన నేతలు తొలి నుంచి డిమాండ్‌ చేస్తున్నట్లు ఉద్దవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్యా ఠాక్రేనే సీఎం అని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *