సిడబ్లూసి సమావేశం నుండి వెళ్ళిపోయిన సోనియా,రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లూసి) సమావేశం నుండి ఆ పార్టీ ఆగ్ర నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అర్దంతరంగా వెళ్ళిపోయారు. ఈ ఎంపిక కోసం సిడబ్లూసి ఐదు కమిటీలుగా విడిపోయింది. అయితే ఈ ఎంపికలో తమ పేర్లను చేర్చడం పై స్పందిస్తూ ఎంపిక బృందాలు తమ పేర్లను పొరపాటుగా చేర్చరంటూ, వారు ఆ కమిటిల్లు  ఉండటం సరైనది కాదంటూ అక్కడినుండి మధ్యలోనే వెళ్ళిపోయారు. కేవలం సీడబ్ల్యూసీ  నేతలతోనే కాకుండా రాష్ట్ర నేతలతో కూడా సంప్రదింపులు జరిపి కొత్త అధ్యక్షుడి ఎంపిక చేయాలన్న రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. దీంతో పార్టీ నూతన చీఫ్‌ ఎన్నికకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రాహుల్‌ రాజీనామాతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది తెలిసిందే.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *