ఖైదీలకు స్వయం ఉపాధిలోనైపుణ్యం

విశాఖ కేంద్ర కారాగారం మరో ప్రత్యేకతను దక్కించుకోబోతోంది. వివిధ నేరాలపై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక. ఏళ్లతరబడి నాలుగు గోడల మధ్య గడిపేయడంతో ఏ పనిలోనూ నైపుణ్యం సంపాదించలేక జీవనం సాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు అనేక సంస్కరణలు చేపట్టి ఖైదీలకు స్వయం ఉపాధిలో నైపుణ్యం పెరిగేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. స్వయం ఉపాధిలో నైపుణ్యం సంపాదించగలిగితే సులభంగా జీవనం సాగించవచ్చుననే భావనతో ఇప్పటికే వెల్డింగ్‌, కూరగాయల పెంపకం, బేకరీ వంటి రంగాల్లో శిక్షణ ఇస్తోంది. తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. జైల్లోని ఖైదీలకు పసుపు, కారం వంటి మసాలా పొడుల తయారీలో శిక్షణ ఇవ్వడమే కాకుండా జైల్లోనే ఒక యూనిట్‌ను ఏర్పాటుచేసి వారితోనే నడపాలని నిర్ణయించింది. ఇందుకోసం విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఐ ఫ్యూచర్‌ గ్లోబిస్టిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలోనే మొదటిదైన ఈ యూనిట్‌ను రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ హసన్‌ రెజా సోమవారం ప్రారంభించనున్నారు.  జైలు అధికారులు అనేక సంస్కరణలు చేపట్టి ఖైదీలకు స్వయం ఉపాధిలో నైపుణ్యం పెరిగేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆరిలోవలోని కేంద్ర కారాగారంలో ఇప్పటికే ఔషధ మొక్కల పెంపకం, వెల్డింగ్‌, బేకరీ, కూరగాయల పెంపకం వంటి రంగాల్లో శిక్షణనిస్తోంది.అక్కడితో ఆగకుండా తాజాగా దక్షిణ భారతదేశంలోని ఏ జైలులోనూ లేనివిధంగా మసాలా పొడుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని జైలు ఆవరణలోని పాత భవనాన్ని మూడు లక్షలు వెచ్చించి ఆధునీకరించి యూనిట్‌ తయారీకి అనుగుణంగా తీర్చిదిద్దారు. రూ.32 లక్షల వ్యయంతో పొడుల తయారీ యంత్రాన్ని కొనుగోలు చేసి అమర్చడం, ఖైదీలకు శిక్షణ ఇవ్వడం వంటి వాటిలో ఆ సంస్థ జైలు అధికారులకు సహకరిస్తుంది. ఈ యూనిట్‌ను రాష్ట్ర జైళ్లశాఖ సూపరింటెండెంట్‌ రాహుల్‌ నిర్ణయించారు. డీజీ హసన్‌ రెజా, డీ ఐజీ ఇండ్ల శ్రీనివాస్‌ సోమవారం ప్రారంభించనున్నారు.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *