భయ పెట్టడం మాకూ తెలుసు… (‘స్పైడర్’ టీజర్ అదుర్స్)

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’. ఆగస్ట్‌ 9 మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా ‘స్పైడర్‌’ కొత్త టీజర్‌ను విడుదల చేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ప్రజల ప్రాణాలు బలిగొంటూ వారిలో భయాన్ని పుట్టిస్తున్న ఓ రాక్షసుడి ఆట కట్టించే పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని తెలుస్తోంది.

మహేష్ బాబు ఈ మూవీలో గత చిత్రాలకంటే స్టైలిష్ గా కనిపించబోతున్నారు. దర్శకుడు మురుగదాస్ తనదైన మేకింగ్ స్టైల్‌తో ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించారు.పెరుగుతన్న జనాభాను భూకంపం తరహాలో చంపేసే ఒక విలన్. అతను జనాలను భయపెడితే.. అతన్ని భయపెట్టడానికి వచ్చేవాడే స్పైడర్. ఇతగాడు కూడా ఆ విలన్ కు.. అదేనండీ మన ఎస్.జె.సూర్యకు.. భయం అంటే ఏంటో పరిచయం చేస్తాడు. అంటే గవర్నమెంట్ తరుపున పనిచేసే ఒక సూపర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీసర్ అనుకుంట మహేష్.. చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ సినిమాలో సోషల్ పొలిటికల్ అంశాలను మురుగుదాస్ గట్టిగానే టచ్ చేసినట్లున్నాడు. దాక్కున్న ఆ విలన్ ను భయపెట్టి.. అతనికి వార్నింగ్ ఇచ్చే సీన్లో మహేష్ భలే ఉన్నాడు. మొత్తానికి మురుగదాస్ అండ్ మహేష్ కాంబో చాలా సరికొత్త సినిమాను ఆవిష్కరించారని అర్దమవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *