అదిరిపోయే జై లవకుశ స్టొరీ ఇదేనా

జై లవకుశ మొదటి ఆటకు 24 గంటల కంటే తక్కువ సమయం ఉంది. కాని అభిమానులకు మాత్రం అవి గడవటం కూడా మహా గండంగా ఉంది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.ఈ లోపే జై లవకుశ కథ ఇదే నంటూ ఒక స్టొరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజమనిపించేలా ఉన్న ఈ కథ కనక సినిమాలో ఉంటె మాత్రం ఇది రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయంలాగా కనిపిస్తోంది. అదేంటో మీరు చూడండి. జై, లవ, కుశ ముగ్గురు కవల పిల్లలు. చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో అందరు విడిపోతారు. కాని ఎవరికి వారు మిగిలిన వాళ్ళు చనిపోయి ఉంటారు అనుకుని పెరిగి పెద్దవుతారు. జై జోధ్పూర్ వెళ్ళిపోతే లవ బ్యాంకు ఉద్యోగిగా, కుశ దొంగతనం చేసి ఆ డబ్బుతో ఫారిన్ లో సెటిల్ అవ్వాలి అని కలలు కంటున్న వాడిగా ఉంటారు. లవ లవర్ రాశి ఖన్నా .అమెరికా వెళ్ళాలని పాతిక లక్షలు పోగేసిన కుశ ఆ డబ్బును ఏజెంట్ కు ఇస్తాడు. సరిగ్గా అదే రోజు నోట్ల రద్దు జరగడంతో ఆ ఏజెంట్ డబ్బు మొత్తం వెనక్కు ఇస్తాడు. దీంతో ఫుల్ గా మందు కొట్టి కుశ ఒక యాక్సిడెంట్ చేస్తాడు.

కుశ యాక్సిడెంట్ చేసే కారు లవదే. అప్పుడు ఇద్దరు ఒకరి సమస్యలు మరొకరు చర్చించుకుంటారు. లవను బ్యాంకులో ఇబ్బందులు పెడుతున్నారు అని తెలుసుకున్న కుశ ఆ ప్లేస్ లో తాను వెళ్లి అన్ని సెట్ చేస్తాను అని చెబుతాడు. రద్దైన నోట్లు మార్చుకోవచ్చు అనేది అతని ఆలోచన. లవ సరే అంటాడు. ఆ రకంగా లవ బ్యాంకులో ఎంటర్ అయిన కుశ కొత్తగా ప్రవర్తించి అందరికి అనుమానం వచ్చేలా చేసుకుంటాడు.

మరో వంక జోధ్పూర్ లో ఉన్న జై రాజకీయంగా ఎదగాలని చూస్తూ ఉంటాడు. కాని పుట్టుక నుంచే నత్తి ఉండటంతో పబ్లిక్ లో స్పీచ్ ఇవాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు.ఓ సందర్భంలో నివేదాని చూసి మనసు పారేసుకుంటాడు. జైకి నాటకాల పిచ్చి. రావణాసురుడి పాత్ర అంటే ప్రాణం ఇస్తాడు. జై కి తన తమ్ముళ్ళు ఉన్నారనే నిజం తెలిసి వాళ్ళను కిడ్నాప్ చేయిస్తాడు. తన దగ్గరకు వచ్చాక లవను పబ్లిక్ లో స్పీచ్ లివ్వడానికి, కుశను తాను ప్రేమించిన అమ్మాయి నివేదాకు దగ్గరవ్వడానికి వాడుకుంటాడు. కాని నివేదాకు నిజం చెప్పిన కుశనే ప్రేమిస్తుంది. అలా ముగ్గురు కవలలు జై ఇంట్లోనే ఉంటారు.

అపోజిషన్ పార్టీలో వాళ్ళు జై ని చంపాలని స్కెచ్ వేస్తారు. జైకు తోడుగా ఉండే సాయి కుమార్ ఇది పసిగట్టి లవను వెళ్ళకు అని హెచ్చరిస్తాడు. కానీ లవ వినడు. దానికి ఒక్క రోజు ముందు జై లో మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో లవ, కుశలు రామాయణం నాటకం ప్లాన్ చేస్తారు. జై కు ప్రాణమైన రావణుడి పాత్ర కాకుండా రాముడి పాత్ర ఇస్తారు. అది పోషించాక జైలో మార్పు వస్తుంది. తరువాతి రోజు జైకి నిజం చెప్పకుండా లవ, కుశ సభకు బయలుదేరతారు. చివరి నిమిషంలో సాయి కుమార్ జై కు నిజం చెబుతాడు. తమ్ముళ్ళ నిజాయితీ గుర్తించిన జై వెంటనే అక్కడికి బయలుదేరతాడు. మరి జై తమ్ముళ్ళను రక్షించుకున్నాడా, అసలు విలన్ ఎవరు అనేది క్లైమాక్స్ లో ఎవరు ఊహించలేని గొప్ప ట్విస్ట్ .

ఇది నిజమో కాదో తెలియదు కాని సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయిన ఇది వింటుంటే ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం అనిపిస్తోంది. ఇంత గ్రిప్పింగ్ తో ట్రిపుల్ రోల్ స్టొరీ రాసుకున్న దర్శకుడు బాబీని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఇందులో సగం నిజమైన చాలు సూపర్ హిట్ గ్యారెంటీ అంటున్నారు ఫాన్స్. మొత్తానికి జై లవకుశ అంచనాలు మించేలా ఉండటం ఖాయం అని తేలిపోయింది. జనతా గ్యారేజ్ లాంటి రెగ్యులర్ ప్రోడక్ట్ తోనే రికార్డులు తిరగ రాసిన తారక్ ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కథ పడితే వదులుతాడా. బాక్స్ ఆఫీస్ ఊచకోత చూడడానికి రెడీ అవ్వండి మరి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *