బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సుమ..!

జూనియర్ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా స్టార్‌ మాలో ప్రసారమవుతున్న  బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎవరూ ఊహించని విధంగా చాలా రంజుగా సాగుతోంది. గతవారం ప్రేక్షకుల ఊహకు అందని విధంగా కత్తి కార్తీక, ధనరాజ్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక 7వ వారం కూడా ఎలిమినేషన్ల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ సారి ఇద్దరు చొప్పున ఇంటి సభ్యులను పిలిచిన బిగ్ బాస్….. ఇద్దరూ కలిసి ఏకాభిప్రాయంతో మరో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లను నామినేట్ చేయాలని కోరారు. ఇలా వారు చెప్పిన పేర్ల ప్రకారం నవదీప్, ప్రిన్స్, ఆదర్శ్, అర్చన, దీక్ష, ముమైత్ నామినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ఎంపిక ప్రక్రియ కూడా ఈ సారి డిఫరెంటుగా సాగింది. ఇక ఈ షోలోకి స్టార్ యాంకర్‌ సుమ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

ఈ షో ప్రారంభంలో కంటెస్టెంట్‌గా పాల్గొనేందుకు స్టార్ యాంకర్ సుమను సంప్రదించారని.. సుమ చాలా సౌమ్యంగా ఆ ఆఫర్ ను తిరస్కరించించారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ చేస్తున్న పోగ్రామ్ కు సుమ నో చెప్పటం అనేది అప్పట్లో వైరల్ న్యూస్ అయింది. అందులోనూ ఎన్టీఆర్ కు సుమ భర్త రాజీవ్ కనకాల మంచి స్నేహితుడు. నో అనే పరిస్దితి లేదు. అయినా సరే సుమ నో చెప్పటం ఆశ్చర్యమే.

తాజాగా ఈ రూమర్లకు ఫుల్‌ స్టాప్ పెడుతూ బిగ్‌ బాస్ హౌస్‌లోకి సుమ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఆదివారం షోలో సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక తారక్‌ విషయానికి వస్తే అతని స్క్రీన్‌ ప్రెజెన్స్, వాగ్ధాటి సూపర్‌. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *