మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల నోటిఫికేషన్

మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల నగారా మోగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ విడుదలకానుందని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. నామినేషన్లకు అక్టోబర్ 4 చివరి తేది కాగా, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 5న జరగనుంది. అక్టోబర్ 21న పోలింగ్, 24న ఫలితాలు విడుదలకానున్నాయని ఈసీ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈసీ కఠిన నిబంధనలు విధించింది. ఎన్నికల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అభ్యర్థులు తమ ప్రచారంలో ప్లాస్టిక్ ఉపయోగించకూడదు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి వ్యయ పరిమితిని గరిష్టంగా రూ.28 లక్షలుగా నిర్ణయించారు. నామినేషన్ పత్రంలో ఒక్క కాలమ్ వదిలినా నామినేషన్ రద్దవుతుందని ఈసీ చెప్పారు. ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

 

హార్యానాలో 90 స్థానాలు, మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. నవంబర్ 2న హర్యానా అసెంబ్లీ, నవంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీ గడువులు ముగియనున్నాయి. మహారాష్ట్రలో 8.94 కోట్లు, హర్యానాలో 1.82కోట్లు ఓటర్లు ఉన్నారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *