చిదంబరం ముందస్తు బెయిల్ కు సుప్రీం నిరాకరణ

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు వ్యవహారంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ ఢీల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నేడు చిదంబరం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బెంచ్‌ నిరాకరించింది. ఆయన పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత చూపలేదు. బుధవారం ఉదయం దీన్ని దాఖలు చేయాలని సూచించింది. దీంతో చిదంబరం తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, వివేక్‌ టంకా నేడు ప్రత్యేక లీవ్‌ పిటిషన్ దాఖలు చేయగా. విచారణ జరిపేందుకు జస్టిస్‌ రమణ నిరాకరించారు. మరోవైపు బుధవారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ విషయంలో ఆయన మీద కేసు నమోదయ్యింది.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *