ఆ క్లబ్బులోకే శృతి అండ్ తమన్నా

కొందరు హీరోయిన్లంతే.. అసలు ఏజ్ లెస్ అనే తరహాలో నటించేస్తున్నారు. ఒకప్పుడు శ్రీదేవి మాత్రమే అటు తండ్రి అక్కినేని నాగేశ్వర్రావు ఇటు కొడుకు నాగార్జునతో నటించిన ఖ్యాతిని పట్టేసింది. కాని ఇప్పుడు కాజల్.. సమంత వంటి భామలు రెండు తరాలతోనూ నటించేస్తున్నారు. అల్లు అర్జున్ తో చేసిన సమంత.. పవన్ తోనూ చేసింది. నాగ్ తో చేసిన లావణ్య త్రిపాఠి.. చైతన్యతోనూ చేస్తోంది. ఇక కాజల్ గురించి చెప్పేదేముంది.. అమ్మడు చరణ్.. బన్నీ.. పవన్.. ఇప్పుడు చిరంజీవితో కూడా నటించేసింది. అయితే ఈ క్లబ్బులో తదుపరి ఇద్దరు హీరోయిన్లు చేరే ఛాన్సుందని తెలుస్తోంది.

ఒక ప్రక్కన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను రెడీ చేయిస్తున్న చిరంజీవి.. మరో ప్రక్కన ఒక కమర్షియల్ కథను కూడా చెక్కిస్తున్నారట. ఒకటి సురేందర్ రెడ్డి డైరక్ట్ చేస్తే మరొకటి బోయపాటి శ్రీను డైరక్ట్ చేసే ఛాన్సుంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఒక దానిలో శృతి హాసన్ హీరోయిన్ గా చేసే ఛాన్సుంది. మరొక కమర్షియల్ సినిమాలో తమన్నాను తీసుకుంటున్నారట. ఆల్రెడీ రచ్చ సినిమా ఆడియో లాంచ్ టైములో తమన్నాతో నేను డ్యాన్సు వేస్తేనా అని చిరు కోరుకుంటే.. ఆ తరువాత తమన్నా మా టివి అవార్డుల్లో చిరంజీవితో కలసి స్టెప్పులేసింది. ఇక సినిమాలో కూడా కనిపించేస్తే.. కాజల్ పేరిటి ఉన్న ”టోటల్ ఫ్యామిలీ హీరోయిన్” క్లబ్బులో శృతి అండ్ తమన్నాలు కూడా జాయినైపోతారు.

చూస్తుంటే కాస్త సినిమా ఛాన్సులు తగ్గుతున్నాయి అనిపిస్తున్న హీరోయిన్లకు ఇప్పుడు చిరంజీవి మెగా ఛాన్సులు ఇస్తున్నట్లున్నారు. వీళ్ళకు ఆఫర్లు కావాలి ఆయనకు హీరోయిన్లు కావాలి. సో విన్ విన్ సిట్యుయేషన్ అనమాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *