తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి – ప్రధాని ప్రశంస

కేంద్ర ప్రభు త్వం నుంచి తెలంగాణ సర్కారుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్‌టీ బిల్లును తొలుత ఆమోదించిన తెలంగాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సీఎంల భేటీలో ప్రధాని ప్రశంసించారు. జీఎ్‌సటీ బిల్లు తొలి దశలోనూ తెలంగాణ ఇదే చొరవను ప్రదర్శించిందన్నారు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల ధోరణిని కనబరిచారు. తెలంగాణ ఉచితఎరువుల పథకాన్ని నీతి ఆయోగ్‌ సభ్యుడు సభ్యుడు రమేశ్‌ చంద్‌ కూడా ప్రశంసించారు. రుణమాఫీతో పోలిస్తే ఇది మంచి నిర్ణయమన్నారు. రుణమాఫీ ఇవ్వాలనుకుంటున్న రాష్ట్రాలు తెలంగాణ తరహాలో ఎరువులు ఇవ్వడం, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం మంచిదన్నారు.

ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు అభినందనీయమన్నారు. 2022కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమం సహా పలు అంశాలపై నీతిఆయోగ్‌ మంగళవారం మూడేళ్లకార్యాచరణను ప్రకటించింది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగాడియా, సాగు రుణాల మాఫీ రాషా్ట్రల పరిధిలోని అంశమని పనగాడియా అన్నారు. రద్దు చేయాలనుకుంటే రాష్ట్ర రాజకీయ నాయకత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధానాన్ని రూపొందించటం, దాన్ని అమలు చేయటం, అవసరమైన సాంకేతికతను అందించటమే తమ బాధ్యతన్నారు. చాలా రాషా్ట్రల్లో కరువు కాటకాల వల్ల రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అన్నారు. పెట్టుబడి ఖర్చులను తగ్గించి, దిగుబడిని పెంచటం ద్వారా మాత్రమే రైతులకు దీర్ఘకాలిక మేలు చేయగలమన్నారు.

అందుకోసం సాంకేతికతను అందుబాటులోకి తేవాలని, రాయితీపై వ్యవసాయ పనిముట్లను అందజేయాలన్నారు. రుణమాఫీ సరికాదన్నారు. రుణమాఫీతో పోలిస్తే రైతులకు ఎరువులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మంచిదే అన్నారు. రుణమాఫీ చేస్తే అప్పటికే చెల్లించిన వారు నష్టపోతారని, ఎగ్గొట్టడమే పనిగా పెట్టుకున్నవారు లాభపడతారన్నారు. మాఫీ కంటే తిరిగి చెల్లించే సామర్థ్యం కల్పిస్తే రైతులు అన్ని సవాళ్లనూ తట్టుకుంటారన్నారు. రుణమాఫీ చేయాలని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే తప్పు పట్టలేమన్నారు. రాష్ట్రాలు తమ ఆర్థిక వనరులను అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోవచ్చన్నారు. రుణమాఫీ కంటే రైతులు సామర్థ్యాన్ని పెంచుకుని రుణాలను చెల్లించే వరకూ వడ్డీ మాఫీ చేయటం మంచి ఆలోచన అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *