తెలంగాణ బడ్జెట్…2019-20 సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రిశాసనసభలో కే.కెసిఐర్ ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.. బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లుగా సీఎం కేసీఆర్‌ చూపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సెప్టెంబర్‌ 30తో కాలపరిమితి ముగియబోతున్న నేపథ్యంలో 2019–20కు సంబంధించిన పూర్తిస్థాయి వార్షిక చిట్టాపద్దును కేసీఆర్‌ సభ ముందు ఉంచారు. వాస్తవిక దృక్పథంతో ఈసారి బడ్జెట్‌ను రూపొందించామని, రాష్ట్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని సీఎం వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే సభను 14వ తేదీ(శనివారం)కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రెకటించారు.

రైతుబంధు పథకానికి రూ.12 వేల కోట్లు.

పంట రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు.

గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపు.

పురపాలక సంఘాలకు రూ.1,764 కోట్లు.

ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.1,336 కోట్లు.

ఆసరా పింఛన్ల కోసం రూ.9,402 కోట్లు.

రైతుబీమా ప్రీమియం చెల్లింపునకు రూ.1,137 కోట్లు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *