డోంట్ ఆర్గ్యూ ఆమ్రపాలీ ! కేటీఆర్

వరంగల్ జిల్లా కలక్టర్ ఆమ్రపాలి కి తెలంగాణా లో చాలా మంచి పేరుంది. ఆమె చాకచక్యమైన కలక్టర్ గా తెలివిగల లేడీ గా ఎన్నో సంవత్సరాల నుంచే ప్రజల మన్నన పొందుతోంది. ఇక సోషల్ మీడియా లాంటి చోట్ల అయితే ఆమెని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు జనాలు. ఈమె విషయం లో ఇప్పుడు అనుకోని ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదురు అయ్యింది. తెలంగాణా రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆమ్రపాలి మీద సీరియస్ అవ్వడం సెన్సేషన్ అయ్యింది.

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిపై తెలంగాణా మున్సిపల్ పాలనా వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది పనుల నిర్లక్ష్యంపై  మందలించారు. ప్రభుత్వం నిధులిస్తున్నా పనులు ఎందుకు చేయడంలేదని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, మేయర్, ఎమ్మెల్యేలను ఆయన నిలదీశారు. శనివారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరైన కేటీఆర్.. ఈ నగర  ప్రజల అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ 300 కోట్లు కేటాయించారని, వాటి ప్రతిపాదనలెక్కడని ప్రశ్నించారు.  ” నిధులిస్తాం.. లక్ష్యాలు కేటాయిస్తాం.. ఇంకేం చేయాలి? ముఖ్యమంత్రి వచ్చి అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టాలా.. అని ఎమ్మెల్యే వినయ్ ని ఉద్దేశించి అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ఎలా ఆని వ్యాఖ్యానించారు. ఒక దశలో కలెక్టర్ ఆమ్రపాలి జోక్యం చేసుకోబోగా.. డోంట్ ఆర్గ్యూ ఆమ్రపాలీ అని అసహసనం వ్యక్తం చేయడంతో ఆమె మరేమీ మాట్లాడలేకపోయారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *