క్లైమాక్స్ లో తెలంగాణ ఆర్‌టి‌సి

దాదాపు 46రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే అవకాశముందని సమాచారం. ఒకవేళ సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం నిరాకరిస్తే.. ఏం చేయాలనే దానిపైనా కార్మిక సంఘాల నేతలు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై టీఎంయూ, ఈయూ కార్మిక సంఘాల నేతలలు విడివిడిగా భేటీ అయి చర్చిస్తున్నారు. మొత్తం 97 డిపోల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమై..

సమ్మె నేపథ్యంలో చోటుచేసుకున్న 24 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలపైనా కార్మిక నేతల మధ్య చర్చ జరిగింది. కార్మికులు సమ్మె విరమించి.. బేషరతుగా విధుల్లోకి చేరేందుకు ముందుకొస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం రెండు గడువు విధించింది

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *