కుక్క కూడా రొమాంటిక్కే, ప్రియాంక చోప్రా మూవీ పెద్దలకు మాత్రమేనా?

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కొంతకాలంగా హాలీవుడ్ ప్రాజెక్టులతోనే బిజీ బిజీగా గడుపుతోంది. క్వాంటికో టీవీ సిరీస్ ద్వారా అమెరికన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన ప్రియాంక తనదైన అందం, పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఆమెకు హాలీవుడ్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్’ సినిమా చేసిన ప్రియాంక…. ప్రస్తుతం ‘ఎ కిడ్ లైక్ జేక్’, ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ అనే చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ అనే చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన రొమాంటిక్ సినిమానేమో? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ చిత్రంలో ప్రియాంక చోప్రా చాలా బోల్డ్‌గా నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇండియన్ సినిమాల్లో కూడా ప్రియాంక ఎప్పుడూ ఇంత బోల్డ్ గా నటించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

డైలీమెయిల్ లీక్ చేసిన ఈ వీడియోలో హాలీవుడ్ నటుడు ఆడమ్ డివైన్ ప్రియాంకతో ప్రవర్తించిన తీరు చూసి ఇదేదో అడల్ట్ ఫిల్మ్ మాదిరి ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్ చిత్రానికి టోడ్ స్ట్రాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. ఇండియాలోనే రొమాంటిక్ కామెడీ చిత్రాలంటే ఓ రేంజిలో ఉంటాయి. మరి హాలీవుడ్లో రొమాంటిక్ డోసు కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *