డ్రగ్స్ మత్తులో రవితేజ్ – పూరి జగన్ – ఛార్మి??

డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్‌‌ను విచారిస్తున్న సమయంలో అనేక కొత్త కోణాలు వెలుగు చూశాయి. కెల్విన్‌ కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా విచారణ జరిపిన అధికారులు.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.  వీరిని ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రశ్నించనున్నారు.  హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అన్న తేడా లేకుండా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్నవారందరినీ విచారించేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసింది.  ఇప్పటికే గుర్తించి, నోటీసులు పంపించిన వారందరినీ వారంపాటు విచారించనుంది. ఇందులో ప్రముఖ హీరో రవితేజ, ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, హీరోయిన్ చార్మీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితమే కెల్విన్‌ సినీ పరిశ్రమపై కన్నేసినట్లు అధికారుల విచారణలో తేలింది.
నోటీసులు అందుకున్నది వీళ్లే
హీరోలు: రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు
హీరోయిన్ చార్మీ, ముమైత్ ఖాన్,
డైరెక్టర్ పూరీ జగన్నాథ్,
కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు,
ఆర్ట్ డైరెక్టర్ చిన్నా

శ్రీనివాసరావు(రవితేజ డ్రైవర్)

ఇప్పుడు ఈ సెలబ్రిటీలు తమ డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న సిసి టివి ఫుటేజీలూ.. అలాగే ఈ సెలబ్రిటీలు డ్రగ్ పెడ్లర్లతో సాగించిన వాట్సాప్ సంభాషణలు.. వగైరా వగైరా సాక్ష్యాలు ఉన్నాయట. అంతేకాదు.. వీరిలో కొంతమంది సెలబ్రిటీలు బ్యాంకాక్ వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంటే.. కొందరు విచారణకు తాము హాజరు కాకుండా లాయర్ ను పంపిస్తామని చెబుతున్నారట. అయితే ఎక్సయిజ్ శాఖ మాత్రం.. పర్సనల్ గా విచారణకు రావల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది.

వీరందరూ 19వ తారీఖు నుండి 27వ తారీఖు మధ్యన నాంపల్లి ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో అధికారుల సమక్షంలో విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వీరు హాజరుకాకపోతే మాత్రం అరెస్టు చేసే అవకాశం కూడా ఉందట. ఇప్పటివరకు 12 మంది తెలుగు సెలబ్రటీలు నోటీసులు అందుకోగా.. వారిలో 10 మంది నోటీస్ తీసుకున్నట్లు ఎక్నాలెడ్జమెంట్ కూడా అందిందంట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *