షాకింగ్ : సిట్ విచార‌ణ‌కు వ‌స్తున్న‌వాళ్లంతా ‘తాగి’ వెళ్తున్నార్ట‌!

డ్రగ్స్ విచారణకు సంబంధించి ఒక సంచలన విషయం బయటకు రావటం తెలిసిందే. విచారణకు వస్తున్న ప్రముఖులు పలువురు ఉత్సాహంతో రావటం.. తాము సుద్దపూసలమన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే. అయితే.. వారి కాన్ఫిడెన్స్ వెనుకున్న అసలు విషయాన్ని సిట్ చీఫ్ అకున్ సబర్వాల్ తనదైన శైలిలో బయట పెట్టేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విచార‌ణ‌లో భాగంగా సిట్ అధికారుల‌కు దిమ్మ‌తిరిగే నిజాలు తెలుస్తున్నాయి. సినిమావాళ్ల ముందు చూపుకూ, తెలివి తేట‌ల‌కూ సిట్ ఆశ్చ‌ర్య‌పోతోంది. విచార‌ణ‌కు వ‌స్తున్న‌వాళ్లంతా అలువీరా జ్యూస్ తాగి వ‌స్తున్నార్ట‌. అలువీరా తాగితే ఓ సౌల‌భ్యం ఉంది. ఒక‌వేళ ర‌క్త న‌మూనాలు తీసుకొంటే – డ్ర‌గ్స్ తీసుకొన్న విష‌యం తెలుసుకోవ‌డం క‌ష్టం అవుతుంద‌ని స‌మాచారం. దాంతో.. సిట్ అధికారులు నివ్వెర‌పోతున్నార్ట‌. డ్ర‌గ్స్ తీసుకొన్నారో లేదో తెలుసుకోవ‌డం కోసం అవ‌స‌ర‌మైతే ఓ ప్ర‌త్యేక యంత్రాన్ని తీసుకొస్తామ‌ని సిట్ అధికారులు చెబుతున్నారు.

అలువీరా జ్యూస్ శరీరంలో విషతుల్యాలు తొలగించి.. జీవ క్రియల్ని పునర్నిర్మించటంలో కలబందం దివ్య ఔషధంగా పని చేస్తుంది. సాధారణంగా శరీరంలో ఏ రూపంలో అయినా.. ఏ రకమైన ఔషధాన్ని పెద్ద మొత్తంలో తీసుకున్నా.. వాటి విషతుల్యాలు శరీరంలో అలా పేరుకు పోతాయి. దీంతో శరీర జీవక్రియలు దెబ్బ తింటాయి. అలాంటి వాటిని కలబంద మెరుగుపర్చటంతో పాటు.. విషతుల్యాల్ని కవర్ చేస్తాయి.

జబ్బుల్ని తగ్గించటానికి వాడిన వివిధ డ్రగ్స్ మూలాలు శరీరంలో పేరుకుపోతాయి. వాటి చెడు ప్రభావం నుంచి బయటపడేయటానికి కలబంద ఉత్పత్తుల్ని మంచి ప్రభావాన్ని చూపిస్తాయని అయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *