టాలీవుడ్‌లో డ్రగ్స్‌: ఆ యువ హీరోయేనా.?

టాలీవుడ్‌ని డ్రగ్స్‌ కలకలం ఓ ఊపు ఊపేస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మీడియా ముందుకొచ్చి, డ్రగ్స్‌ విషయమై స్పందించారు. కొందరి వల్ల మొత్తం సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందంటూ వాపోయారు. కొందరు డ్రగ్స్‌కి అలవాటు పడ్డ మాట వాస్తవమేనని సాక్షాత్తూ ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు చెప్పుకొచ్చారు. ఇతర సినీ ప్రముఖులదీ అదే మాట.

తెలంగాణ ఎక్సయిజ్‌ శాఖ – సిట్‌ ద్వారా పది మంది సినీ ప్రముఖులు నోటీసులు కూడా అందుకున్నారు. ఇందులో ముగ్గురు యువ హీరోలు వున్నారన్నది మీడియాలో విన్పిస్తున్న కథనాల సారాంశం. ఇంతకీ ఎవరా ముగ్గురు హీరోలు.? ఈ ప్రశ్నకు సినీ పరిశ్రమలో రకరకాల ఊహాగానాలే సమాధానాలవుతున్నాయి.

చాలాకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో హల్‌చల్‌ చేస్తున్న ఓ యువ నటుడిపై మొదటి నుంచీ డ్రగ్స్‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడూ అందరి దృష్టీ ఆ యువ నటుడిపైనే పడ్తోంది. మరోపక్క, ఓ నిర్మాత పేరూ విన్పిస్తోంది. అసలు ఆయన నిర్మాతగా వెలగబెడ్తున్నదేమీ లేదనీ, డ్రగ్స్‌ ద్వారా సంపాదించిన సంపాదనతోనే నిర్మాతగా తన ఉనికిని కాపాడుకుంటున్నాడనీ ప్రచారం జరుగుతోంది.

ఓ ఫైట్‌ మాస్టర్‌, ఓ డైరెక్టర్‌.. ఇలా డ్రగ్స్‌ ఆరోపణలకి సంబంధించి ఆయా వ్యక్తుల పేర్లు గాసిప్స్‌ కాలమ్స్‌లో గట్టిగానే విన్పిస్తున్నాయి. విచారణకు హాజరు కావాల్సిందిగా ‘సిట్‌’ నోటీసుల్లో పేర్కొన్న దరిమిలా, ఆ పది మంది ఎవరన్నది త్వరలోనే తేలిపోనుంది.

ఈలోగా, కొన్ని నిజాలే గాసిప్స్‌గా వస్తోంటే, ఇంకొంతమంది పనిగట్టుకుని కొందరి మీద దుష్ప్రచారం చేస్తుండడం గమనార్హం. గిట్టని వారి మీద ‘కసి’ తీర్చుకునే క్రమంలో, ‘ఫలానా వ్యక్తి అట కదా..’ అంటూ సినీ జనం మీడియా కంటే ఎక్కువగా గాసిప్స్‌ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *