సీనియర్లలో కలకలం లేపుతున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి టి‌పి‌సి‌సి చీఫ్ పదవి ఇస్తారనే వార్తలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చలకు దారి తీస్తుంది. ఇప్పటిదాకా సీనియర్లకే ఆ పదవి దక్కుతుందని ఆశ పెట్టుకున్నవారంత ఇప్పుడు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తెలంగాణలో కే‌సి‌ఆర్, బి‌జే‌పి లను సమర్ధంగా ఎదుర్కొనే వ్యక్తికే పగ్గాలు చేపట్టాలని భావిస్తోంది. ఈ విషయంలో అందరికంటే ముందున్న రేవంత్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించకుండా ఇలాంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఎలా తీసుకుంటుందని కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారని సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *