త్రిష మాజీ లవర్..తెలుగు హీరోయిన్ ని లైన్ లో పెట్టేసాడు

చెన్నై: త్రిషతో డేటింగ్, ప్రేమ,ఎంగేజ్ మెంట్ అంటూ మీడియాలో వార్తల్లోకి ఎక్కి, తర్వాత బ్రేకప్ చేసుకుని,ట్వీట్లలో తిట్టుకున్న మాజీ ప్రియుడు వరణ్ మణియన్ ఏం చేస్తున్నాడు..అతనేం చేస్తే మాకేంటి అంటారా..అదీ నిజమే అనుకోండి. అయితే అతను మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే అతను ఈ లోగా మరో హీరోయిన్ తో ఎఫైర్ మొదలెట్టాడు కాబట్టి. అఫ్ కోర్స్ ఇధ్దరికీ ఇష్టమైనప్పుడు అందులో ఇసుమంత కూడా తప్పు ఉండనట్లే అనుకోండి.

పూర్తి వివరాల్లోకి వెళితే…బిజినెస్ మ్యాన్, నిర్మాత వరుణ్‌ మణియన్‌ని వివాహం చేసుకుంటున్నట్లు కొంతకాలం క్రితం త్రిష ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఘనంగా నిశ్చితార్థం కూడా అయ్యింది. అయితే సినిమాల్లో నటించొద్దని వరుణ్‌ అనడంతో త్రిష అతడితో బంధాన్ని అంతటితో ఆపుతూ పెళ్లిని రద్దు చేసింది. వేరే కారణాలు ఉన్నాయని మీడియా లో వార్తలు వచ్చాయనుకోండి.

అయితే తాజాగా వరుణ్‌తో తెలుగు హీరోయిన్ బిందుమాధవి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. గత ఏడాది జులై 1న విడుదలైన ‘జాక్సన్‌ దురై’ (తెలుగు టైటిల్‌: దొర) తర్వాత బిందుమాధవి ఏ చిత్రానికి సంతకం చేయలేదు.

వరుణ్, బిందు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్రిష లాంటి స్టార్ హీరోయిన్ ను మేనేజ్ చేయడం కష్టంకానీ, బిందుమాధవి లాంటి చిన్న రేంజి హీరోయిన్ తో ఇబ్బంది ఏముంటుంది అంటున్నారు. బిందుమాధవికి హీరోయిన్ గా పెద్దగా అవకాశాలేమీ లేవిప్పుడు. అందుకే ఇక లైఫ్ లో సెటిలైపోదామని చూస్తున్నట్లుంది. మరి వీరి బంధం ఎంతదూరం వెళ్తుందో చూడాలి అంటోంది తమిళ మీడియా.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *