టీఆర్‌ఎస్‌ నేత కుమారుడి వీరంగం..

టోల్‌ఛార్జ్‌ అడిగినందుకు ఓ టీఆర్‌ఎస్‌ నేత కుమారుడు వీరంగం సృష్టించాడు. స్నేహితులతో కలిసి టోల్‌ సిబ్బందిపై కత్తులతో దాడి చేశాడు. ఎల్బీనగర్‌ టీఆర్‌ఎస్‌ ఇంఛార్జ్‌ రాంమోహన్‌ గౌడ్‌ కుమారుడు మనీష్‌ శ్రీశైలం హైవేపై ఉన్న కడ్తాల్‌ టోల్‌గేట్‌ సిబ్బందిపై  దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం రాత్రి 9.30 సమయంలో జరిగనట్లు తెలుస్తోంది.
సిబ్బంది టోల్‌ ఫీజు అడిగినందుకు మనీష్‌ అతని స్నేహితులు ఆగ్రహంతో సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించారు. అంతే కాకుండా కత్తులతో దాడి చేసి కారులో పారిపోతుండగా మంకాల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురి యువకులపై ఐపీసీ 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.  గాయపడ్డ ముగ్గురి సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. యువకులంతా తాగిన మైకంలో ఇలా చేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలుపుతున్నారు. కేవలం రూ.30ల టోల్‌ గేటు ఫీజు కోసమే ఈ గొడవ జరిగిందని, టోల్‌ సిబ్బంది ఆర్తనాదాలతో పరుగెత్తినట్లు  సాక్ష్యులు తెలిపారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *