క్రికెట్ మ్యాచ్ లో హాట్ టాపిక్ గా మారిన వారి రొమాన్స్

క్రికెట్ మ్యాచ్ అన్నంతనే సీరియస్ గా ఆడే ఆటే గుర్తుకు వస్తుంది. అందుకు భిన్నంగా వాణిజ్య అంశాలు కలిసి మ్యాచ్‌కు కొత్త ఇమేజ్ తెచ్చేలా  చేశాయి. క్రికెట్ ను మరింతగా మార్చేందుకు కొత్త తరహా ఏర్పాట్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్.. పాక్ మధ్య మ్యాచ్ అన్నంతనే ఎంతలా భావోద్వేగాలు బయటకు వస్తాయో.. ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్  ల మద్య జరిగే యాషెస్ సిరీస్ లోనూ  అలాంటివే కనిపిస్తాయి.

ఈ సిరీస్ జరుగుతున్నంత సేపు రెండు జట్ల మధ్యనే కాదు.. రెండు దేశాల ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురి అవుతుంటారు. ఈ సిరీస్ సందర్భంగా రెండు దేశాల మధ్య సోషల్ మీడియాలో జరిగే చర్చలు.. వాదోపవాదాలు అన్నిఇన్ని కావు.  దీంతో భారీగా హీట్ జనరేట్ అయ్యే పరిస్థితి. ఇలాంటి వేళ.. ఆటకు కొత్త హంగులు చేర్చేలా నిర్వాహకులు ప్రయత్నించంతో అందరి దృష్టి ఇప్పుడు అటువైపు మళ్లుతోంది.

యాషెస్ సిరీస్ జరుగుతున్నస్టేడియంలో స్టాండ్‌ను తీసేసి.. ఆస్థానంలో స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాటు చేయటం.. ఆ సందర్భంగా ఒక జంట చేసిన రొమాన్స్ మ్యాచ్ ను సైతం ప్రభావితం చేసింది. ఈ ఆసక్తికర పరిణామం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

యాషెస్ సిరీస్ లో సాగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట లంచ్ బ్రేక్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ క్రీజ్‌లోకి వస్తున్నాడు. అదే సమయంలో స్టేడియంలోని ఈతకొలనులో తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడో యువకుడు. అక్కడితో ఆగకుండా ముద్దు పెట్టుకొన్నారు. ఆపై రొమాన్స్ చేశారు. క్రికెట్ గ్రౌండ్ లో వీరి రొమాన్స్‌ను మ్యాచ్ నుకవర్ చేసే కెమేరా లు ఫోకస్ చేయటంతో స్టేడియంలోని మానిటర్లతో పాటు.. లైవ్ లో ఉన్న వారికి సైతం ఈ దృశ్యాలు వెళ్లిపోయాయి.
ఈ సందర్భంగా కామెంటరీ బాక్స్ లో ఉన్న వారు సైతం ఈ జంట రొమాన్స్ ను ప్రస్తావించారు. స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ తో పాటు.. వాణిజ్య అంశాల్ని మరిన్ని చేరిస్తే ఈ తరహా సీన్లు మరెన్ని దర్శనమిస్తాయో..?  చూస్తుంటే.. క్రికెట్ రంగు.. రుచి.. వాసన మారిపోతున్నట్లు కనిపించట్లేదు?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *