హైద‌రాబాద్‌లో ఉబ‌ర్ బైక్స్‌…

హైద‌రాబాద్ వాసుల‌కు ఫాస్ట్ జ‌ర్నీ కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ మొత్తం ట్రాఫిక్ వ‌ల‌లో చిక్కుకుంది. సిటీ జ‌నాలు ట్రాఫిక్‌లోనే స‌గం కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఇక‌పై వీరికి వ‌చ్చే యేడాది నుంచి ప్ర‌యాణంలో స‌రికొత్త అనుభూతి క‌ల‌గ‌నుంది. ప్రయాణంలో ఉల్లాసం, ఉత్సాహం సొంతం చేసుకోబోతున్నారు. రద్దీ మార్గాల్లో షేరింగ్ ఆటోలు, సిటీ బస్సుల్లో ప్రయాణించవలసిన అవసరం వచ్చే జనవరి నుంచి ఉండదు. హైద‌రాబాద్ వాసులు హాయిగా బైక్ స‌వారీ చేసే స‌దుపాయాన్ని ఉబర్ ఇండియా అందిస్తోంది.

ఈ మేర‌కు ఉబ‌ర్ సంస్థ‌కు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉబర్ మోటో సర్వీసుల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఉబ‌ర్ బైక్స్‌ను నేరుగా మెట్రో స్టేష‌న్‌కు అనుసంధానం చేశారు. ఉబర్ మోటో బైక్ షేరింగ్‌ ద్వారా ప్రయాణం చేయాలంటే మూడు కిలోమీటర్ల వరకు రూ.20 చెల్లించాలి. తదుపరి ప్రతి కిలోమీటర్‌కు రూ.5 చొప్పున చెల్లించాలి.

ఉబ‌ర్ బైక్ బుకింగ్ ఎలా…..

ఉబ‌ర్ బైక్ బుక్ చేసుకోవాలంటే సెల్‌ఫోన్‌లో ఉబర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్‌లో ఉబర్ మోటో అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. బైక్ ఎక్కే ప్ర‌దేశం అక్క‌డ మెన్ష‌న్ చేయాలి. తర్వాత బుక్ చేయాలి. వెంటనే ప్రయాణికుడి వద్దకు వెళ్ళే బైకు వివరాలు, దాని డ్రైవర్ పేరు, ఫొటోలను ఉబర్ తెలియజేస్తుంది. బైకు డ్రైవర్‌తో పాటు దానిపై ప్రయాణించే వ్యక్తి కూడా హెల్మెట్ సిద్ధంగా ఉంటుంది.

ప్ర‌యాణంలో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటిస్తారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, 2 వే ఫీడ్‌బ్యాక్, బంధుమిత్రులతో ఈ ప్రయాణం గురించి తెలియజేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రయాణం ముగిసిన తర్వాత ఛార్జీలను నగదు రూపంలోనూ, ఆన్‌లైన్ పద్దతుల్లోనూ చెల్లించవచ్చు. బెంగళూరులో కనీస ఛార్జి రూ.15, కిలోమీటర్‌కు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. బెంగ‌ళూరుతో పోల్చుకుంటే హైద‌రాబాద్‌లో ఈ ఛార్జీలు కాస్త ఎక్కువ‌గానే ఉన్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *