ఇక అమెరికా మొత్తం మా గుప్పిట్లో: ఉత్తర కొరియా

ఉత్త‌ర కొరియా తాజాగా అమెరికాకు మ‌రో వార్నింగ్ ఇచ్చింది. తాము తాజాగా ప‌రీక్షించిన‌ ఖండాంత‌ర బాలిస్టిక్ మిస్సైల్ అమెరికా మొత్తాన్ని క‌వ‌ర్ చేస్తుంద‌ని అక్క‌డి మీడియా వెల్ల‌డించింది. శుక్ర‌వారం నార్త్ కొరియా మ‌రో బాలిస్టిక్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష త‌ర్వాత అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ.. ఈ మిస్సైల్ టెస్ట్‌తో ఎప్పుడైనా, ఎక్క‌డైనా మిస్సైల్‌ను ప్ర‌యోగించే సామ‌ర్థ్యం నార్త్ కొరియా సంపాదించింద‌ని ప్ర‌క‌టించారు.

అంతేకాదు అమెరికాలో ఎక్కడి ల‌క్ష్యాన్నైనా ఛేదించే స‌త్తా ఇప్పుడు త‌మ‌కు ఉంద‌ని ఉన్ స్ప‌ష్టంచేసిన‌ట్లు అక్క‌డి మీడియా తెలిపింది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చ‌రిక‌లు స‌మాధానంగా నార్త్ కొరియా ఈ మిస్సైల్స్ టెస్ట్‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది. ఈ నెల‌లో ఖండాంత‌ర బాలిస్టిక్ మిస్సైల్ ప‌రీక్ష నిర్వ‌హించ‌డం ఇది రెండోసారి. అయితే ట్రంప్ ఈ మిస్సైల్ ప‌రీక్ష‌ను ఖండించారు. ఇది నిర్ల‌క్ష్య, ప్ర‌మాద‌క‌ర చ‌ర్యగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇలాంటి ప‌రీక్ష‌ల‌తో ప్ర‌పంచాన్ని హెచ్చ‌రించామ‌ని భావిస్తున్న ఉత్త‌ర కొరియా ఇప్పుడు ఒంట‌రైంది. వాళ్ల ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌మైంది అని ట్రంప్ అన్నారు. త‌మ భూభాగాన్ని ఎలా ర‌క్షించుకోవాలో తెలుస‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. అటు జ‌పాన్ కూడా నార్త్ కొరియా మిస్సైల్ టెస్ట్‌ల‌ను ఖండించింది.

తాజాగా నిర్వహించిన పరీక్షల తర్వాత కిమ్‌ చాలా ఉత్సాహంగా కనిపించారు. మేం దాడి చేయగల పరిధిలో అమెరికా మొత్తం ఉంది అంటూ ఆయన అన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా అమెరికా భూభాగంపై దాడి చేయగల సత్తా ఇక మాది’ అని కిమ్‌ అన్నట్లు కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఎజెన్సీ తెలిపింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *