రోజా సెల్ఫీపై వర్మ అభ్యంతరకర కామెంట్లు

రోజా సెల్ఫీపై ….     సెల్ఫీలో రోజాగారు హీరోలా ఉన్నారు. కానీ ఆమె కుడి పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అతను రోజా గారి అందాన్ని పాడు చేస్తున్నారు. ఒకవేళ అతను ఆమెకు దిష్టి బొమ్మ అయిఉండొచ్చ`ని రామ్‌గోపాల్ వర్మ ట్వీట్‌ చేశాడు. అలాగే `అందమైన రోజా గారి పక్కన కూర్చుని ఆ ఫోటోను నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా?` అని మరో ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్లపై బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారుసోషల్ మీడియాలో వైరల్ అయిన ఏదో ఒక విషయంపై తనదైన శైలిలో సంచలన కామెంట్లు చేస్తుంటాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ హీరోలపై కామెంట్లు చేసిన వర్మ తాజాగా నందమూరి హీరో బాలకృష్ణను టార్గెట్ చేశాడు. తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణతో వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా తీసుకున్న సెల్ఫీ బాగా వైరల్ అయింది. ఈ సెల్ఫీపై వర్మ అభ్యంతరకర కామెంట్లు చేశాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *