వినయ విధేయ రామ – క్లోజింగ్ కలెక్షన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా రూపొంది సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో దిగిన వినయ విధేయ రామ నెల రోజులు తిరక్కుండానే ఫైనల్ రన్ కు వచ్చేసింది. ఒకటి రెండు మినహా దాదాపు అన్ని చోట్ల తీవ్రమైన డెఫిషిట్ తో రన్ అవుతోంది. పేరుకే పోస్టర్ ఉంది కాని చాలా సెంటర్స్ లో సెకండ్ షోలు రద్దు చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయని ట్రేడ్ సమాచారం.
అయితే ఇంత దారుణంగా పరాజయం పాలైనా ఇది 62 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. నైజాంలో దిల్ రాజు కు ఐదు కోట్లకు పైగా నష్టాన్ని మిగల్చగా ఏ ఒక్కరూ దీని వల్ల సేఫ్ కాలేకపోయారు. హైర్ పద్ధతి వల్ల కొన్ని చోట్ల ఈ శాతంలో కొంత మార్పు ఉంది. ఇక ఏరియాల వారిగా అదనంగా ఇంకేమి వచ్చే అవకాశం లేకపోవడంతో ఫైనల్ గా ఈ ఫిగర్స్ తో వివిఆర్ కథ ముగిసిపోయింది
నైజాం – 12 కోట్ల 60 లక్షలు
సీడెడ్ – 11 కోట్ల 90 లక్షలు
ఉత్తరాంధ్ర – 8 కోట్ల 50 లక్షలు
ఈస్ట్ గోదావరి – 5 కోట్ల 40 లక్షలు
వెస్ట్ గోదావరి – 4 కోట్ల 43 లక్షలు
గుంటూరు – 6 కోట్ల 35 లక్షలు
కృష్ణా – 3 కోట్ల 70 లక్షలు
నెల్లూరు – 3 కోట్ల 30 లక్షలు
తెలుగు రాష్ట్రాల ఫైనల్ క్లోజింగ్ షేర్ – 55 కోట్ల 76 లక్షలు
(తెలుగు రాష్ట్రాలకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ – 76 కోట్ల 60  లక్షలు)
రెస్ట్ అఫ్ ఇండియా – 5 కోట్ల 40 లక్షలు
ఓవర్ సీస్ – 1 కోటి 45 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఫైనల్ షేర్ – 62 కోట్ల 61 లక్షలు
(ప్రపంచవ్యాప్తంగా జరిగిన థియేట్రికల్ బిజినెస్ – 92 కోట్ల 10 శాతం)
రికవరీ శాతం – 65
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *