ఆగ‌ని వాన‌.. ఎమర్జెన్సీ నెం. 100…పెరిగిన సాగ‌ర్ నీటిమ‌ట్టం

ఏక‌దాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ న‌గ‌రంలోని హుస్సేన్ సాగ‌ర్ జ‌లాశ‌యం నీటిమ‌ట్టం పెరిగింది. న‌గ‌రంలో రోజంతా జ‌ల్లులు ప‌డుతుండ‌గా అప్పుడ‌ప్పుడు భారీ వ‌ర్షం కురుస్తుంది. వ‌ర‌ద నీరు ర‌హ‌దారుల‌పై చిన్న‌పాటి కాలువ‌లుగా ప్ర‌వ‌హిస్తుంది. ప‌లు ప్రాంతాల్లో ర‌హ‌దారులు పాక్షికంగా దెబ్బ‌తిన్నాయి. అబిడ్స్‌, జూబ్లిహిల్స్ వంటి ప‌లుచోట్ల చెట్లు రోడ్ల‌పై విరిగిప‌డ్డాయి. మ‌ల‌క్‌పేట‌, ఖైర‌తాబాద్‌, పంజాగుట్ట‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ త‌దిత‌ర‌ ర‌ద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నెమ్మదిగా క‌దులుతుంది. ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాలు స‌జావుగా సాగేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి నగరం అతలాకుతలమవుతుంది. వానలపై ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు సమీక్షిస్తున్నారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూం. నెంబర్ 100 లేదా 21111111ను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ 24/7 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నగర వాసులు తమ కాలనీల్లో వర్షాల వల్ల తలెత్తిన సమస్యలను పై నెంబర్ల ద్వారా జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేవచ్చు.

590 మంది సిబ్బందితో 140 మొబైల్, మినీ మొబైల్ టీమ్స్ ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఒక సెంట్రల్ ఎమర్జెన్సీ టీమ్ ను అందుబాటులో ఉంచింది. 5 జోన్లలో 5 టీమ్స్, 30 సర్కిళ్లలో 30 టీమ్స్ ను సిద్ధంగా ఉంచింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *