సులభంగా శరీర బరువు పెంచే పండ్లు

బరువు తక్కువగా ఉండటం ప్రస్తుత కాలంలో చాలా సాధారణం. ఈ కాలంలో పెరిగే ఒత్తిడి, క్రమంలేని ఆహార సేకరణ మరియు అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, భౌతిక కార్యాలను చేయకపోవటం మరియు జన్యుపరంపర సంక్రమణ వంటి కారణాలు తక్కువ బరువుకు కారణం అని చెప్పవచ్చు. బరువు పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఆరోగ్య నిపుణుడి సూచనల మేరకు కొవ్వు పదార్థాలు లేని, అధిక క్యాలోరీలను అందించే భోజనాలతో కూడిన ఆరోగ్యకర ఆహార ప్రణాళిక మంచి మార్గంగా చెప్పవచ్చు. త్వరగా ఫలితాలను పొందుటకు భౌతిక వ్యాయామాలను అనుసరించటం కూడా అవసరమే.

ఇంట్లోనే చేసుకోగల, బరువు పెంచే పదార్థాల గురించి కింద తెలుపబడింది.

బననా మిల్క్ షేక్

ఒక గ్లాసు అరటిపండు మరియు పాలు కలిపి తయారు చేసిన బననా మిల్క్ షేక్ ను రోజులో రెండు సార్లు తాగండి. దీనికి బదులుగా రోజు 3 అరటిపండు తిన్నను సరిపోతుంది. ఇలా తిన్న వెంటనే ఒక గ్లాసు పాలు లేదా గిన్నె నిండా పెరుగు తినండి. ఒకవేళ బననా తినటానికి ఇష్టం లేకపోతే, వివిధ రకాల పండ్లు, పాలు కలిపిన మిశ్రమాన్ని తినండి. ఈ పండ్ల ద్వారా శరీరానికి చక్కెరలు మరియు పాల నుండి ప్రోటీన్ లు అందించబడతాయి.

ఖర్బుజ

ఖర్బుజ కూడా శరీర బరువు పెరుగుటలో సహాయపడుతుంది. త్వరగా మంచి ఫలితాలను పొందుటకు, రోజులో 3 సార్లు అధిక మొత్తంలో ఖర్బుజను తినండి.

వేడి పాలు

ఒక చెంచా తేనె కలిపిన గ్లాసు వేడి పాలను రోజు తాగండి. పిడికెడు ఖర్జూర, ఫిగ్స్ మరియు బాదంలను పాలలో కలిపి కొద్ది సమయం వరకు వేడి చేయండి. తక్కువ బరువు ఉన్న వారు ఇలాంటి వాటిని తాగటం వలన శరీర బరువు సులువుగా పెరుగుతుంది.

మామిడిపండు

శరీర బరువును సమర్థవంతంగా పెంచే మరొక పండుగా మామిడిని పేర్కొనవచ్చు. మామిడి పండ్లను తిన్న తరువాత వెంటనే ఒక గ్లాసు పాలను తాగండి. దీనికి బదులుగా, ఒక నెల రోజుల పాటు మ్యాంగో షేక్ తాగండి. దీని వలన శరీర బరువు త్వరగా, సులభంగా పెరుగుతుంది.

ఎండు ద్రాక్ష

రెసిన్స్ లేదా ఎండు ద్రాక్ష కూడా శరీర బరువు పెంచుటలో సహాయపడతాయి. కావున రోజు కనీసం 30 గ్రాముల ఎండు ద్రాక్షను తినండి.

ఫిగ్స్

అనోరెక్సియా (తినడానికి సంబంధించిన రుగ్మత), బరువు తక్కువ వంటి సమస్యలను ఫిగ్స్ శక్తివంతంగా తగ్గిస్తాయి. 3 నుండి 4 ఎండు ద్రాక్షలను తీసుకొని నీటిలో ముంచండి. వీటిని పూర్తీ రాత్రి వరకు అలాగే నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన తినండి. శరీర బరువు పెంచే సులువైన పద్దతిగా దీనిని పేర్కొనవచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *