నాలుగేళ్లు నరకం: రోజూ 30 మంది.. ఆమెను 43 వేలసార్లు రేప్ చేశారు!

మెక్సికో సిటీ: ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి గిప్ట్ లు, డబ్బు, ఖరీదైన కార్ల మోజులో పడి.. ఆపైన మానవ అక్రమ రవాణా ముఠా చేతుల్లో పడింది. అక్కడ నాలుగేళ్లపాటు నరకం చవిచూసింది. 2006లో పోలీసులు జరిపిన రైడింగ్ ద్వారా ఆ నరకం నుంచి తప్పించుకున్న ఆ యువతి ప్రస్తుతం లాయర్ అయింది. ఆ నాలుగేళ్లలో తాను అనుభవించిన నరకయాతన గురించి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించిందామె.

మెక్సికో దేశానికి చెందిన ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి కార్లా జాసింటో. 12 ఏళ్ల వయసులో ఓ హ్యూమన్ ట్రాఫికర్ పట్ల ఆకర్షితురాలైంది. గిప్ట్ లు, డబ్బు, ఖరీదైన కార్ల మోజులో పడి అతడ్ని గుడ్డిగా నమ్మింది.. అంతే.. ఆ తరువాత భూమ్మీదే నరకం కనిపించింది.

ఓ రోజు కార్లాను ఆమె బాయ్ ఫ్రెండ్ తనతో వచ్చేయమని అడిగాడు. జల్సా జీవితం అనుభవించ వచ్చని భావించిన ఆమె అతడ్ని గుడ్డిగా నమ్మి వెళ్లిపోయింది. తల్లిదండ్రులను వదిలిపెట్టి అలా బయటికి వెళ్లిన కార్లా.. ఆ తరువాత కొద్దికాలానికే మానవ అక్రమ రవాణా ముఠా చేతుల్లోకి వెళ్లింది. వారు మెక్సికోలోని టెనాన్సింగ్ పట్టణానికి ఆమెను తరలించారు. అది మనుషల అక్రమ రవాణాకు నిలయ. మూడు నెలల పాటు అక్కడే ఉంచి, ఆ తర్వాత మరో పెద్ద నగరానికి తరలించి అక్కడ బలవంతంగా ఆమెను వ్యభిచారంలోకి దించారు.

మానవ అక్రమ రవాణా ముఠా సభ్యులు కార్లాను బలవంతంగా వేశ్యా వృత్తిలోకి దించారు. ఉదయం 10 గంటల నుంచి ఏదో ఆఫీసులో పని చేసిన మాదిరిగానే.. అర్థరాత్రి వరకు విటులు వస్తూనే ఉండే వారు. బాధ తట్టుకోలేక ఆమె ఏడుస్తుంటే విటులు వికటాట్టహాసాలు చేసేవారు. ఆమె వద్దకు వచ్చే విటులు కూడా ఒక్కొక్కరు.. ఒక్కో రకం మరి. కొన్నిసార్లు కళ్లు మూసుకుని బాధను బలవంతంగా దిగమింగుకునేదట.

ఒకరోజు ఓ విటుడు కార్లా వద్దకు వచ్చి వెళ్లిన తరువాత ఆమె మెడపై పెదవుల గుర్తులు ఉండటాన్ని ఆమెను ఆ వృత్తిలోకి దింపిన వ్యక్తి గమనించాడు. అంతే.. అతడిలోని రాక్షసుడు నిద్రలేచాడు. విచక్షణా రహితంగా ఆమెను ఇనుపగొలుసులతో కొట్టాడు. పిడిగుద్దులు కురిపించాడు. జుట్టు పట్టుకుని పైకి లేపి ఆమె ముఖంపై ఉమ్మాడు, తరువాత ఇనుప చువ్వను కాల్చి వాతలు కూడా పెట్టాడు.

మెక్సికోలో ఏటా కనీసం 20 వేల మంది అమ్మాయిలు మానవ అక్రమ రవాణా బారిన పడుతున్నారు. 2006లో పోలీసులు ఈ మానవ అక్రమ రవాణా ముఠాపై జరిపిన రైడింగ్ కార్లా పాలిట వరమైంది. ఆ రైడింగ్ ద్వారా ఆమెకు హ్యూమన్ ట్రాఫికర్స్ చెర నుంచి విముక్తి లభించింది. అవకాశం ఇస్తే వేశ్య కూడా తన జీవితాన్ని మార్చుకోగలదు అనడానికి కార్లా జాసింటో జీవితమే ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఆమె లాయర్ అయి తానేంటో లోకానికి చాటిచెప్పింది. ఇప్పుడు మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తనలాగే బలైపోతోన్న ఎంతోమంది అమ్మాయిల తరుపున కోర్టుల్లో వాదిస్తోంది.

మానవ అక్రమ రవాణా చేతుల్లో గనుక పడకపోయి ఉంటే.. కార్లా జీవితం కూడా అందరు అమ్మాయిల్లాగే ఉండేదేమో. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే కూడా ఏమిటో తెలియని వయసులోనే ఆమె వారి దాష్టీకానికి బలైపోయింది. నాలుగు సంవత్సరాల పాటు రోజూ 30 మంది తనపై అత్యాచారం చేశారని, అలా 43,200 సార్లు రేప్ చేశారని, ఆ రోజులను తలుచుకుంటే ఇప్పటికీ తనకు వణుకు వస్తుందని కార్లా జాసింటో స్వయంగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *