రివ్యూ: ‘యుద్ధం శరణం’

క‌థ‌: ముర‌ళీ దంప‌తులు (రావు ర‌మేశ్‌, రేవ‌తి) డాక్ట‌ర్లు. సమాజ శ్రేయ‌స్సే త‌మ ల‌క్ష్యంగా ప‌నిచేస్తుంటారు. వారికి ముగ్గురు పిల్ల‌లు. ఇద్ద‌రు కుమార్తెలు. ఒక‌బ్బాయి. అబ్బాయి పేరు అర్జున్ (నాగ‌చైత‌న్య‌). అత‌ను డ్రోన్ డిజైనింగ్ చేస్తుంటాడు. శ్రీమ‌తి ముర‌ళీ ద‌గ్గ‌ర ఇంట‌ర్న్ షిప్ చేయాల‌ని వ‌చ్చిన అంజ‌లి (లావ‌ణ్య త్రిపాఠి), అర్జున్‌తో ప్రేమ‌లో ప‌డుతుంది. అంతా స‌వ్యంగా సాగుతుంద‌నగా ముర‌ళీ దంప‌తులు చ‌నిపోతారు. వారిది హ‌త్యా? ప్ర‌మాద‌మా? అనేది స‌స్పెన్స్. మ‌రోవైపు ప‌ద‌వుల‌ను ఆశించిన రాజ‌కీయ‌నాయ‌కుడు (వినోద్ కుమార్‌) న‌గ‌రంలో బాంబులు పెట్టిస్తాడు. అందుకు నాయ‌క్ (శ్రీకాంత్‌)ను వాడుకుంటాడు. ఈ బాంబ్ బ్లాస్ట్ కు, ముర‌ళీ దంప‌తులు క‌న్నుమూయ‌డానికి, నాయ‌క్‌కు, రాజ‌కీయ‌నాయకుడికి సంబంధం ఉందా? ఉంటే ఎలాంటిది? మ‌ధ్య‌లో ఎన్ ఐ ఎ అధికారి తీసుకున్న చొర‌వ ఎలాంటిది? ఇంత‌కీ సెల్వ‌మ్ ఎవ‌రు? వంటివ‌న్నీ స‌స్పెన్స్.
ప్ల‌స్ పాయింట్లు
నాగ‌చైత‌న్య బాగా చేశాడు. అత‌ని ల‌వ‌ర్‌గా, లావ‌ణ్య త్రిపాఠి న‌ట‌న బావుంది. కొడుకుతో తండ్రికుండే అనుబంధం గురించి రావు ర‌మేశ్ చెప్పే మాట‌లు మెప్పిస్తాయి. చ‌దువుకున్న చ‌క్క‌టి ఇల్లాలిగా, భ‌ర్త అభిప్రాయాల‌ను గౌర‌వించే భార్య‌గా, చ‌క్క‌టి త‌ల్లిగా, స‌మాజ శ్రేయ‌స్సును కాంక్షించే వ్యక్తిగా రేవ‌తి న‌ట‌న చాలా మంచి మెప్పు పొందుతుంది. ఒక‌ర‌కంగా మ‌న సినిమాల్లో జ‌య‌సుధ న‌టించే పాత్ర త‌ర‌హా పాత్ర ఇది అని చెప్పొచ్చు. చెయ్ అక్క‌చెల్లెల్లుగా న‌టించిన వారు ఇద్ద‌రూ కొత్త‌వారే అయినా బాగానే న‌టించారు. `పెళ్లి చూపులు`లో ఫ్రెండ్ కేర‌క్ట‌ర్ చేసిన ప్రియ‌ద‌ర్శి ఇందులో తెలంగాణ యాస‌లో మాట్లాడే డాక్ట‌ర్‌గా మెప్పించారు. త‌న‌కు ఇచ్చిన ప‌రిధిలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ను చ‌క్క‌గా పోషించార‌నే పేరు శ్రీకాంత్ సొంత‌మ‌వుతుంది. యాగ్రెసివ్ చూపులు, క‌ర‌కైన చేష్ట‌ల‌తో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌తో శ్రీకాంత్ ఆక‌ట్టుకున్నారు.
మైన‌స్ పాయింట్లు
పాట‌లు బాగా లేవు. క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేసే కుర్రాడి క‌థ అని, ఇంట‌లిజెన్స్ బేస్డ్ మూవీ అని ప్ర‌చారం జ‌రిగింది. సినిమాలో అంత‌గా ఎత్తుకు పై ఎత్తులు వేసిన దాఖ‌లాలు క‌నిపించ‌వు. అటు రాజ‌కీయ‌నాయ‌కుడిగా చేసిన వినోద్ కుమార్‌గానీ, ఇటు నాయ‌క్‌గా న‌టించిన శ్రీకాంత్ పాత్ర‌లు కానీ బ‌లంగా లేవు. ఒక రోజులో ఓ పాతికేళ్ల కుర్రాడు అటు పోలీసుల‌ను ప‌ట్టించుకోకుండా, ఇటు ఓ మాఫియా స్థాయి డాన్‌ను అంత తేలిగ్గా ఎలా ఎదుర్కోగ‌లిగాడో అర్థం కాదు. ఇంట‌ర్వెల్ కూడా పెద్ద‌గా ఏమీ ర‌క్తి క‌ట్టించ‌దు. క‌థా, క‌థ‌నం పేల‌వంగా ఉంది.
చిత్రం : ‘యుద్ధ శరణం’
రేటింగ్- 2.50/5
నటీనటులు: అక్కినేని నాగచైతన్య – లావణ్య త్రిపాఠి – శ్రీకాంత్ – రేవతి – రావు రమేష్ – మురళీ శర్మ – ప్రియదర్శి – రవి వర్మ – వినోద్ కుమార్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మిరెడ్డి
కథ: డేవిడ్ నాథన్
మాటలు: అబ్బూరి రవి
స్క్రీన్ ప్లే – డేవిడ్ నాథన్ – అబ్బూరి రవి
నిర్మాత: రజని కొర్రపాటి
దర్శకత్వం: కృష్ణ మారిముత్తు
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *